వెళ్ళకూ అని అనను, వెళ్ళూ అని అనను
నువ్వు నా రుతుస్రావపులాంటి వాడివి, నా అస్తిత్వానివీ, బాధవీ
కదిలే ముళ్ళ గాలివీనూ: నీ కనులు మూసుకుని
రక్తపు గాలుల విలయ మారుతాల రక్తపు నృత్యాలను చూడు. నేను
నీ కలకి ఆవలి ఒడ్డున కదులాడుతుంటాను
నీ దేహపు మరో అంచున మంచు బొట్టునై అంటిపెట్టుకుని ఉంటాను
కదులుతూ నిశ్చలంగా ఉండే
అనామకమైన ఆకు కింద ఒదిగి ఉండే నీడలా,
నేను రెండు పదాల మధ్య సంచరిస్తూ ఉంటాను.
వెళ్ళకూ అని అనను, వెళ్ళూ అని అనను
No comments:
Post a Comment