ఈ సాయంత్రం చెట్లనీ గూళ్ళకి తిరిగివచ్చిన పక్షుక కలకలంతో నిండిపోతాయి
చీకటిలో సముద్రాన్ని వింటున్నట్టు
అరుపులతో అలలలాంటి ఈ పక్షులు చిన్న పిల్లల్లా గొడవ చేస్తాయి
పగలంతా ప్రయాణించి, ఆహారం వెదుక్కుని
తమకై, తమలాంటి గూల్లకై తిరిగి వచ్చాయవి.
మరికొంత సమయం తరువాత, ముప్పిరిగొన్న ఈ చెట్లలో
పక్షుల రెక్కల్లో అంతన్తమైన నిశ్శబ్దం అలుముకుంటుంది
కొంత ప్రశాంతమైన చీకటీ కమ్ముకుంటుంది.
తిరిగి వచ్చిన ఇన్ని పక్షుల మధ్య తిరిగిరాని ఒక పక్షి ఏమైందో
నీ తెలుసా?
No comments:
Post a Comment