03 August 2010

ఇతరులకి ఇద్దరు. ౮ (మొదటి సమాగమం)

అపరిచితమైన గదిలోకి
సాయంత్రాన్ని వెంటదీసుకుని వెళ్ళినప్పుడు
కొంత వర్షం, కొంత సంతోషం
తెల్లటి సీతాకోకచిలుకల కాంతిలో
కొంత పెనుగులాట, కొంత చమట.

అపరిచితమైన సాయంత్రం. అనంతమైన రక్తం.

2 comments:

  1. ఇక్కడ నిన్నుకలుస్తాను

    బహుశా ఒకే శిక్షకు గురయిన ఇద్దరు నేరస్తులు మాట్లాడుకున్నట్టుగా, వేళ్ళను కాసింత లోపలికి జొనిపి కొసలకంటిన నెత్తుటిమరకలనూ,కనుకొలుకులలో పేరిన తడిని ఏదో గొప్ప పనిలో పడి యధాలాపంగా తుడుచుకున్నట్టుగా

    ఇక్కడ నిన్ను కలుస్తాను

    మాటలలో పడి ఉత్తి మాటలతో మాటాడీ మాటాడీ చివరకు ఎదురుబొదురుగా కూర్చుని మోకాళ్ళ నడుమ తలకాయ ఇరికించుకుని నేలపై వేళ్ళతో ఏవేవో గీతలు గీస్తూ ఉన్నట్టుండీ దిగ్గున లేచిపోయే ఆ ఇద్దరినీ చూచి సన్నని నిట్టూర్పేదో నీకు మాత్రమే తెలిసిన అర్థంతో నీ నుంచీ తొలుచుక వచ్చేటప్పుడు

    ఇక్కడ నిన్ను కలుస్తాను

    కేవలం కవిత్వం కోసం నిను కని పెంచిన తల్లి ముందరయినా దిగంబరంగా సాగిలబడగల ధైర్యాన్ని ప్రోది చేసుకుని అప్పుడప్పుడయినా జీవితం ముందర భుజాల మీద చేతులు వేసుకుని మాటాడే వాడొకడికోసం వెతుకులాడుతూ

    ఇక్కడ నిన్ను కలుస్తాను

    ReplyDelete
  2. @నాగరాజు గారు,
    ఎక్కడిదండీ ఈ పద్యం? బావుంది...

    ReplyDelete