ప్రతి రోజూ రాత్రి ఎవరూ చూడని పురాతన కట్టడంలో
దుంగలతో మంట వేసుకుని
నువ్వు కనిపించని వాళ్ళు చెప్పే వినిపించని కథలని వింటావు.
సాలీళ్ళూ, గబ్బిలాలూ
వృక్షాలలో మెసిలే నిదురంచని పక్షులూ, దయ్యాలూ. ఇక
రాత్రంతా గాలి సర్పంలా నీ పరిసరాల్లో
తిరుగాడుతూ ఉంటుంది. ఇక రాత్రంతా నువ్వు
ఎవరూ గమనించని పురాతన కట్టడంలో
నీ దేహంతో నువ్వు మంట వేసుకుని
రెండు నిద్ర మాత్రలతో, గుప్పెడు సిగరెట్లతో, మణికట్టుపై
చల్లగా వాలే బ్లాడుతో
నువ్వు ఎవ్వరికీ కనిపించని వాళ్ళు చెప్పే
వినిపించని కథలను రాస్తావు.
No comments:
Post a Comment