నీ నవ్వు ఇప్పటికీ ఇక్కడ సుడులు తిరుగుతుంది. వలయాలుగా
ఆ తరంగాలలో కొట్టుకుపోయి
పేరు లేని ప్రదేశాలలో రాలిపోతాను. అనంతమైన ఖాళీ మైదానంలో
ఎటు చూసినా నేనే. నువ్వు
ధూళిలా మారి వెళ్ళిపోయావు. ఇక కళల లోపలా కలలకి వెలుపులా
కనులలో దుమ్ము పడి, కన్నీళ్లు అన్నీ
దారి పొడుగూతా సుడులు తిరుగుతూనే ఉంటాయి.
No comments:
Post a Comment