ఈ వేళ ఈ రాయి రెక్కలు విచుకున్న ఒక పూవు
అది వేళ ఒక సీతాకోక చిలుకలా విహరిస్తుంది
అది వేళ ఒక పసివాడిలా ఆడుకుంటుంది
అదివేళ ఒక పసివాడిలా వాసన వేస్తుంది
అది వేళ ఒక పసివాడిలా నిదురోతుంది.
ఈ వేళ ఒక రాయి సీతాకోకచిలుక రెక్కలకుపైగా
ప్రయాణించే ఒక గులాబీ పూవు అని
అతడు అంటుండగా, వాళ్ళు తమ జీవితకాలమంతా
పదిలంగా దాచిపెట్టుకున్న రాళ్ళతో
అతడిని తరిమి తరిమి, విసిరి విసిరి కొట్టారు. ఇక
ఒక నవ్వుతో, కనులలో నెమ్మదిగా పేరుకుంటున్న
కన్నీళ్ళతో
అతడు తన నీడతో అక్కడ నుంచి వెడలిపోయాడు.
*Nietzsche's Wanderer and his Shadow*
No comments:
Post a Comment