రాత్రి నారింజ కాంతిలో గోడపై మెరిసే ఆకుల నీడలు: నువ్వు వాటితో మాట్లడగలవా?
రాత్రి:
ఒక చిక్కటి చీకటి విస్మృతి నిన్ను తన బాహువులలో పోదుపుకుంటుంది. దాని గోరువెచ్చని లోతుల్లోకి నువ్వు రాలిపోతావు. వాళ్ళు జీవితం అని పిలిచే కనులలోకి, కనులలో మంచులా కమ్ముకుంటున్న రక్తంలోకీ వాళ్ళు నిస్సహాయత అని పిలిచే విశ్వంలోకీ నువ్వు వేదనతో రాలిపోతావు, నేనూ రాలిపోతాను. వాళ్ళూ రాలిపోతారు. నగ్నంగానో ధైర్యంగానో
ప్రేమతోనో ద్వేషంతోనో ఆమె కూడా రాలిపోతుంది. పిల్లలు గాయలుగా మారిన దేహంతో ఒక తల్లీ
దుఃఖపు ఊయలగా మారిన మనస్సుతో ఒక స్త్రీ కూడా రాలిపోతుంది. రాలిపోవడంతోనూ, ఎంతో తపనగా పిలవడంతోనూ మనం కూడా ఒక తల్లిగా మారిపోతాం. ఇక అప్పుడు, గోడలతో, రాళ్ళతో, రాళ్ళతో కటినంగా మారిన పూలతో మృత్యువంత లోతైన నిశ్శబ్దంతోనూ ప్రార్థిస్తాం మనం. రాలిపోతాం మనం, రోదిస్తాం మనం, రోదనతో పునర్ జన్మిస్తాం మనం -
రాత్రిలో, నారింజ కాంతిలో, నీడల మసక పోగలలో గోడపై గలగలలాడే ఆకులు: నువ్వు. నువ్వు
వాటితో మాట్లడగలవా?
No comments:
Post a Comment