there is no way of knowing
when this song began - Osip Mandelstam
ఈ కోల్పోయినతనం ఎప్పుడు మొదలైయిందో
తెలుసుకునే మార్గం లేదు
ఈ మృత్యువు ఎప్పుడు మొదలైయిందో
తెలుసుకునే మార్గం లేదు. నిజంగా
ఈ వెదుకులాట ఎప్పుడు మొదలైయిందో,
నీ శరీరంలో
నా శరీరంలో
ఈ రాతి సమయాల రక్త, రిక్త ప్రదేశంలో, నిజంగా
ఈ తపన ఎప్పుడు మొదలైయిందో
తెలుసుకునే మార్గం లేదు.
No comments:
Post a Comment