02 August 2010

సమయపు పెదాల పైన నీ శీతాకాలపు వేలిముద్రలు

పగిలిన సమయపు పెదాల పైన నీ శీతాకాలపు వేలిముద్రలు
నన్ను అవ్యక్త తపన ద్వారాల వద్ద వొదిలి వేస్తాయి

మరొకసారి, ఈ నల్లటి రాత్రి నా శరీరాన్ని తన నాలికతో స్పర్శిస్తుంది. నా శరీరం:
అదొక గాయాల గూడు. అది నీ స్వప్నాల రక్తాన్ని తాగుతుంది.
మరొకసారి, ఈ నల్లటి రాత్రి నా కనుపాపలపై
మంచు బిందువులా మారుతుంది. నువ్వు సంవత్సరాలుగా వొదిలివెళ్ళిన, నీవైన
నీ శరీరపు ముధ్రలనీ, ఎప్పటికీ ఉండే
నీవు లేని నీ మృత్యు జాడలనీ అది సజల పూరితంగా మారుస్తుంది. మరొకసారి

పగిలిన సమయపు పెదాలపైన నీ వేలి ముద్రల నల్లటి రాత్రి గడియలు
నన్ను ఈ అవ్యక్త తపన ద్వారాల వద్ద బాషారహితంగా వొదిలి వేస్తాయి

No comments:

Post a Comment