నేనిక నిన్ను చూడలేను.
ఒకప్పుడు నా కలలో పక్షివై
నా భుజంపై వాలిన నిన్ను
నేనిక చూడలేను.
ఏదీ నీ గూడు
ఏదీ నీ పాత
ఏదీ నీ సహచరి
ఏదీ నీ దారి?
నువ్వు మరొకసారి
నేను చూడలేని దారులలో
ప్రయాణిస్తుండవచ్చు
నువ్వు మరొకసారి
అనంతం సమాధి చుట్టూ
అల్లుకున్న నీడలలో
విశ్రమిస్తుండవచ్చు
ఇక్కడొక వర్షం చినుకు
అక్కడొక వర్షం చినుకు
మసకబారిన సంధ్యలో
మెదిలిన నల్లటి పొగమంచులా
నేను నీకై వెదుకుతాను
నా అస్తిత్వపు పక్షివి, నిన్ను
శబ్దాలకూ అర్థాలకూ
మధ్య ఉండే ప్రదేశాలలో
వెదుకులాడతాను
నాకు ఇది చెప్పు, నేను ఎక్కడ
నా గూటినీ
నా పాటనీ
దారి తప్పిన నా ప్రయాణాన్నీ
నీ నయనంలో
విశ్రమించే నా నాయనాన్నీ
ఎక్కడ కనుగొలనో?
No comments:
Post a Comment