ఇప్పుడు చాలా దూరం, ఒకప్పుడు అత్యంత సమీపమైనది ఇప్పుడు చాలా దూరం
అంచులదాక నిండి కూడా పూర్తిగా ఖాళిఅయి
ఇప్పుడు నేను ఎదురు చూస్తాను, శరీరం నిండా కదులాడే జలధరిమ్పులతో
ఇప్పుడు నేను ఎంతగా ఎదురుచూస్తాను!
అద్దాన్ని ప్రతిబింబించే అద్దం: తప్పిదాన్ని ప్రతిబింబించే తప్పిదం. ఎక్కడైతే
పదాలు ఎదురు చూస్తాయో, ఎక్కడైతే
పదాలు అవి కావో, అక్కడ
ఇప్పుడు నేను ఎదురు చూస్తాను, ఒకప్పుడు అత్యంత సమీపమైనదానికి
ఇప్పుడు చాలా దూరం ఎదురు చూస్తాను.
No comments:
Post a Comment