02 August 2010

నువ్వు చూసావా

నేను ఇక్కడ మరణించడం నువ్వు చూసావా?

ఈ నీ పాలిపోయిన ముఖసంధ్యలోంచి, ఈ నీ మరచిపోయిన అరచేతులలోంచి
ఒకప్పుడు కళకళ లాడి ఇప్పుడు శిధిలాలుగా మారిన
నీ నవ్వులోంచీ
ఈ నా పాలిపోయిన ముఖసంధ్యలోంచి మృత్యువులా మారుతున్న
ఈ నా జీవితపు అంతిమ వెలుతురూ
ఈ నా తీరని దిగులూ, స్వహింసతోపాటు నెమ్మదిగా గాలిలో ఆరిపోవడాన్ని

నేను ఇక్కడ మరణించడాన్నీ నువ్వు చూసావా?

No comments:

Post a Comment