కొన్ని యుగాలు అయ్యింది, అతడు అంటాడు, నీ స్పర్శను అనుభూతి చెంది
కొన్ని యుగాలు అయ్యింది, అతడు అంటాడు, నీ పదాలను అనుభూతి చెంది
కొన్ని యుగాలు అయ్యింది, అతడు అంటాడు, నీ నిశ్శబ్దాన్ని అనుభూతి చెంది
రాత్రి నిశ్శబ్దంలో అతడు సముద్రం ముందుగా కూర్చుని పురుగుల శబ్దాల్ని వింటూ
అరుస్తాడు, రోదిస్తాడు అంతిమంగా సముద్రపు ఒడ్డున నిదురిస్తాడు
ఆ తరువాత అలలు అతడిని
మృత్యువువంటి అనంతత్వపు గోరువెచ్చటి సవ్వడులతో కప్పివేస్తాయి:
అవును: నిజమే. అంతిమ మరణం, తెలియని నిశ్శబ్దపు జననమూ అయిన
స్త్రీ స్పర్సాని అనుభూతి చెంది మనిషికి కొన్ని యుగాలు అయ్యింది.
No comments:
Post a Comment