నువ్వు దానిని ఊసరవెల్లి అని పిలవొచ్చు. లేదా నువ్వు దానిని
తనది కాని ప్రదేశంలో తిరుగాడే
నీలి జంతువు అనీ పిలవొచ్చు, లేదా నువ్వు దానిని
నిస్సహాయమైన క్షీరద జంతువు అనీ పిలవొచ్చు.
అది ఒక కోరికను కోల్పోయిన కోరిక లేని కోరిక మాత్రమే.
నువ్వు దానిని రాయి అని పిలవొచ్చు. లేదా నువ్వు దానిని
తనది కాని ప్రదేశంలో వికసించిన
పూవు అనీ పిలవొచ్చు, లేదా నువ్వు దానిని
ఎదారితో నిండిన సముధ్రమనీ పిలవొచ్చు.
అది ఒక కోరికను కోల్పోయిన కోరిక లేని కోరిక మాత్రమే. అది
ఈ పదాలను రాసే ఒక మనిషి మాత్రమే. అది
ఈ పదాలను తుదిపివేసే ఒక మనిషి మాత్రమే.
No comments:
Post a Comment