ఆమెకు ప్రయాణించడం తెలియదు.
ఆమెకు తను ప్రయాణిస్తూన్నాననీ తెలియదు. అదేమిటంటే
ఆమె ప్రయాణంలో అంతర్భాగం. అదేమిటంటే, ప్రయాణం
ఆమెకు ప్రయాణించడాన్ని నేర్పకుండా నేర్పించి. అదేమిటంటే
ఆమె ఈ రాత్రికి చంద్ర కాంతిలో మెరిసే అనంతంగా మళ్ళామళ్ళా
సాగిపోయే ఒక అల. అదేమిటంటే, ఆమె ఈ రాత్రికి
నేను బ్రతికి ఉండేందుకు నా చుట్టూతా తిరుగాడే గుప్పెడు గాలి.
No comments:
Post a Comment