ఆనాడు వేసావు నువ్వొక ఆమ్లెట్
రాముడు మంచి బాలుడు కదాని
మనం మధువుని
ఆకాశపు పాత్రలతో
రాత్రిలో తడిచిన గాలితో తాగినప్పుడు-
కానీ లోకం ఒక సర్పం
అందుకే అది ఇచ్చింది
నీ అమాయకత్వపు హృదయ కాలాలలోకి
ఒక గాయం
చిమ్మింది నీ తెల్లని కనులలోకి
ఒక శోకం
ఒక శాపం-
రామ రామ రామా
ఉన్నావా ఎక్కడైనా
యింకా
రాత్రంతా మనం గడిపిన
ఆ అమృత కాలాల
ఇకిలి నవ్వులలో-?
___________________
రాము వేసిన ఆమ్లెట్ = రామ్లేట్
రామ్లేట్ ....ha ha ha.....నువ్వు సృష్టించిన..పదం...ఆమ్లెట్ ల మధురంగా వుంది....
ReplyDeleteచాల రోజుల తర్వాత..ఓ కవిత చదివి కడుపుబ్బా నవ్వాను.....
ReplyDelete