01 June 2012

ఎలా?

మసక తీగల ధూపంలా
చీకట్లో ఆ ముఖం వద్దకి
-------------- సాగుతాయి నీ రెండు అరచేతులు

ఆ సరస్సులోకి దూకినట్టు
ప్రేమగా రెక్కలు విప్పుకుని
తటాలున సీతాకోక చిలుకలు పచ్చని ఆకులపై నుంచి కదిలినట్టు

గూళ్ళలోంచి
తలలు బయటపెట్టి పిచ్చుక పిల్లలు చూస్తుండగా
---------------------నింగికి పిచ్చుకలు ఎగిరినట్టు

కన్నీటి వాసన వేసే
---ఆ ముఖం వద్దకి
సాగుతాయి నీ రెండు అరచేతులు, పచ్చి గాయంతో
---ఒక మరుపు లేని తనంతో తన తనువు తనంతో-

యిక ఆ తరువాత
నువ్వు నువ్వులా
ఎలా ఉండగలావ్?

No comments:

Post a Comment