26 June 2012

మధువనం

యిక్కడ తాగి
అక్కడ తూగుతాం మనం చక్కగా
నోటినిండా పగిలిన తమలపాకుతో- యిక

నీ పెదాలపై నా ఆత్మ రక్తం

నీ నోటి నిండా ఏరిన
ఏలకుల సువాసన
నీ తడబడే నాలికపై
నా భవిష్యత్తు యింకా ఒక ఆకుపచ్చని రామచిలుక

గది నిండా చెల్లా చెదురైన రబీంద్రుని పదాల మధ్య
మంద్రంగా గమ్మత్తుగా
తూలె నీ చేతుల మధ్య
నీచే చేతబడి చేయబడిన నా శరీరం-

మధుబన్ మిత్రా మధువుతో మిత్రా
తాగినప్పుడు నీ తొమ్మిది అంతస్తుల
ఆ నిశిధి కాంతులలో
మనం తూలినప్పుడు

రాత్రి కుందేలుని వేటాడే
కోయ పిల్ల వలె నువ్వు
ఎంత అందంగా ఉన్నావ్!

1 comment: