తల నిండా నీళ్లోసుకుని
అరచేతుల తువ్వాలుతో
నా ముఖాన్ని తుడుచుకుంటుంటే
చేతివేళ్ళ నిండా నీ ముఖమే అమ్మా
--యిక కళ్ళ నిండా ఎర్రబడ్డ
నువ్వంటిన కుంకుడు రసం
ఉప్పు తిని తిరిగిన కన్నీళ్ళూ
సాంభ్రాణీతో నువ్ అలా
జుత్తుకు పెట్టిన ధూపం
నే హత్తుకున్న నీ దేహం
నీ బొజ్జలో దాచుకున్న
నా బాల్యపు హృదయం
--యిక ఎన్నటికీ
--ఇటు వైపుకి
తలంటిన జామ చెట్ల
తొట్ల కిందకి తిరిగి
రావిక రానే రావు -
maatalu levu cheppadaniki chaalaa baavundi
ReplyDeleteNijjangaa nijam
ReplyDelete-SA