07 June 2012

తప్పు

-ఒక బీరు తాగడం
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండడమే ముఖ్యం

ఏడు బీర్లు తాగాక
నీ గుండె పొగిలి
ఏడవాలనిపించీ
కనుచూపు మేరలో ఎవ్వరూ కానరాకపోతే
యిక అంతకంటే

మరో మృత్యువు
__ఏముంది__?

1 comment:

  1. ఖాళీ బీరుసీసా దొర్లినట్టు
    దొర్లుతుంది దేహం

    ReplyDelete