చీకట్లోంచి ఇన్ని చుక్కల్ని తెంపుకు వచ్చి
నా నుదిటిపై నీ నునుపైన వేళ్ళతో మెత్తగా రాసి
రాత్రి గాలిని చల్లగా
నా వొంటికి పూసి
నన్నైతే నువ్వలా పడుకోబెడతావు కానీ
నువ్వు కంటి నిండుగా
నిదురోయావో లేదో అని
గమనించానా నేను నిన్ను ఎన్నడైనా కనీసం మాట వరసకైనా
అడిగానా ఎప్పుడైనా నేను
నిన్నుఒక చిన్న మాటైనా?
No comments:
Post a Comment