ఎందుకో ఇష్టపడతావు నువ్వు -
నీడలు రాలిన మబ్బుల మధ్యాహ్నం
గాలితో తిరుగుతో
ఈ మట్టిన రాలిన
పూలలో ఒకదాన్ని ఒడిసి పట్టుకుని
జాగ్రత్తగా దుమ్ము దులిపి
అరచేతిలో దాచుకుంటావు
నువ్వు:ఎవరికి తెలుసును
యిక రాత్రికి పూర్తిగా వడలి
చినుకుల శోకంలోకి
ఎందుకో ఇష్టపడి కూడా
రాలిపోయేదీ
పాలిపోయేదీ
నువ్వో నేనో?
No comments:
Post a Comment