20 June 2012

నువ్వు లేని మధుశాల

ఆరిపోయిందీ
---ఈ చంద్రనగరి
---ఈ నక్షత్రనగరి

సీసాల్లోంచి
విడుదలైన
నిశి గంధ పుష్ప ఆత్మలు మళ్ళా
సీసాలలోకే
బిరడాలతో
బిగించబడుతున్నాయ్ అలా
ఇలా అల్లల్లా
నువ్ లేక -

ఒరోరే ఒరే
రారోరే రా
రా రా నా
చీలిన ఆత్మపు
రంపపు తపనా
తీరని నా నీ స్త్రీ
గర్భపు కోతా
అనంత కరుణా
మయా వలయా

రా రా రా

పేగుల నిండా
నిప్పు కణికెల్నితాగి
కాల్చిన పేగుల్ని
కాలేయాన్నీ
వాన రొట్టెతో
కాళ్ళ పులుసుతో
తిని చిందేద్దాం-

1 comment:

  1. ఎప్పుడు రావాలి శ్రీకాంత్...? ఎక్కడ కలవాలి...? .................:)

    ReplyDelete