క్రూర క్రీడా ప్రదర్శన
నీ వాక్య చాతుర్యం -
దానిని నేను
సమూహ సంబంధ
వ్యాపార వర్తకమనే
పిలిచాను
నువ్వొక ఆరితేరిన
కీర్తి కాంక్షకుడవనే
గుర్తించాను. పాపం
ఏం తెలుసు
నిన్ను అల్లుకున్న
వెలిగిన పదాలకు
ఆత్మని గంధంవలె
దేహానికి రాసుకున్న
ఆదిమ శబ్దాలకు
నువ్వొక, రూకల
జాతరవనీ
జాగ్రత్తవనీ?
భళి భళి భళి భళి
బావుంది బలే
విత్తనాలు లేని
కవిత్వ ఫలం -
-సూపర్ మార్కెట్
శీతల గడులలో
అమర్చిన తాజా
పాల పద హారం-
అలా వొలిచి
ఇలా కట్టిన
మొక్కజొన్ను పొత్తుల
తగ్గింపు ధరల
వాచక సౌందర్యం-
పద పద పద యిక
తప్పుకో యిక
నీకెందుకు ఈ
నేలా నీరూ
నింగీ నిప్పూ?
ఒరే, ఒరొరే సమాధులలో
గోడకి వేలాడుతున్నాయి
నిరుటి నీ పుటల శవాలు
ఎవరో వచ్చి
నిన్ను తగలబెట్టేదాకా
నువ్వు ఇంతేనా?
నువ్వు ఇంతేనా?
ReplyDeleteanthe nantara????
srikanth!
ReplyDeleteమీ కవితల్లో శబ్ద సౌందర్యం అద్భుతం!
మొదట అదే నన్ను ఆకర్షించింది.
తరువాత,
వొక మధుశాల,
వొక విషాదం,
జీవితం పై పేరుకున్న విరక్తి,
వొక విరహం,
వొక నైరాశ్యం,
వొక యెడబాటు,
వొక దుఃఖం..,
Life is always a MYSTERY and a Suspense Thriller like movie
which any body cannot foresee the end ?
మీరు రాస్తూ వుండండి , అనుకుని రాయలేనివాళ్ళ కంటే...