19 June 2012

ఏమిటిది?

ఏక పత్రమైన కాంతిని

తాగుతున్నాను
పరమ పవిత్రంగా
ఏక పతీవ్రతుడైన తనువుతో, తనువంత తన అంత పాత్రతో

--నిరంతరం
హాలాహలం

నీ నాభిపై చెవిని ఆన్చి విన్న
నీ లోపలి నేనైన
నీ పసి నెత్తురైన
మందార పూల
శిశు కదలికలతో

నా చెవిలో వీచిన
నీ పలికీ పలుకని
పెదాల రహస్యంతో-

హతవిధీ, ఒక
-హృదయాన్ని

తొలి వానలో దున్ని
నాటుతున్నారు
మట్టివేళ్ళతో ఒక

రూపాన్ని ఎవరో వొంగిన నడుముతో, చూరైన కనులతో
నుదిటి తడిని తుడుచుకునే గాలి వంటి ముంజేతులతో-

ఎక్కడ ఉన్నావు నువ్వు ఇంతకూ
విత్తనం మెత్తగా
మట్టిలోకి ఇంకే మైమరపు కాలాన?

No comments:

Post a Comment