04 June 2012

జ్ఞానదంతం అను నా నాలిక ;-)

నీ నాలిక
అదొక ఒక కుక్క తోక, అదొక వానరం కూడా-

దారిన పోయే వాళ్ళని అది వదలదు
అలా అని పోనీ తను
నిమ్మళంగా ఉండదు

యుగాంతం నుంచి
--యుగాంతం దాకా

తన మహా వాచకానికి తనే కాపలా అదే నిరంతర పద ముద్రణ
నిలువెత్తు తన జ్ఞాన ప్రదర్సన సభలో
తన అనుకురణ అర్పితులైన జిహ్వల మందలతో సాహితీ సేవలో
యిక దివారాత్రులూ తనే కీర్తికి తనే పహారా-

ఒరే, ఒరోరే
ఇంతా చేసీ
--నీకొక పదం చిక్కదు
నాకొక శిల్పం అందదు
--అందుకే

ఒరే నాయనా
జ్ఞానపు బరువుతో, అరువు అక్షరాల రుణాలతో
--అంతిమంగా
ఉరివేసుకున్న

ఒక ఒంటరి వానర శునకపు నాలిక తోకని
____ఊహించావా ఎపుడైనా?_______

1 comment: