04 June 2012

ధైర్యం

నిదుర లేచి
అలా తేలికగా కళ్ళు విప్పుతావు కదా నువ్వు , అప్పుడు

బద్ధకంగా వికసిస్తుంది
ఒక తామరపూల తోట
చిరునవ్వు కదులాడే

గుండ్రటి నీ చక్కటి పసిడి ముఖంలో
రాత్రి నువ్వు కలగన్న
-రహస్యంగా తడిచిన
నీ కలల ఆకుల పచ్చి సువాసనతో-

ఆహ్, యిక నేను

-బ్రతికేందుకు
ఈ లోకంలోకి
ధైర్యంగా కవాతు చేసుకుంటూ వెళ్ళవచ్చు

నీ పెదాల మధ్య మెరిసిన
తెల్లని దానిమ్మ గింజల
చీకటి నీడలలో మెరిసిన కాంతి పుంజాల

ఆ నీ చిన్ని పళ్ళ వరసను
సదా మననం చేసుకుంటో-

1 comment: