13 June 2012

అతను ఆ రాత్రి

వంకీలు తిరిగిన
పాత్రల కనులతో

శరీరం నిండా తనని పులుముకుని
తన నామాన్ని
గంజాయి వలె
గుండెల నిండా పీల్చుకుని, గొంతు

దిగబోయే నిప్ప్పుల మధువును
పుక్కిట పట్టి, తూలుతో పాడుతో

కుడి చేత చేపముక్కతో
ఎడమ చేత పొగాకు తో

అతను- అతనే తటిల్లున
మధుపాత్ర అంచు నుంచి
జాబిలిని మింగిన ఆ రాత్రి

రాతి అలల సరస్సులోకి
మరో ఆలోచన లేకుండా
దుమికాడు-

అతను విస్మరించినదేహీ
దేహం తేలింది ఎక్కడ-?

1 comment:

  1. కవిత బాగుంది...నీ బుక్ కి "టైటిల్" ల పెట్తోచ్చేమో..ఆలోచించు...

    ReplyDelete