రాత్రుళ్ళు ఇంటికి
నే ఆలస్యంగా వస్తే
తలుపుల ముంగిట వెలిగే దీపం నువ్వని
అదే అనుకున్నాము
నేనూ నా ప్రపంచమూ
---ఇంత కాలమూ---
చూడు ఈ వేళ
అలా వర్షం ఆగి
నేను తల ఎత్తి మహా ధీమాగా నిర్లక్ష్యంగా
నువ్వు లేని చెట్ల కింద వెచ్చగా
నే నడుచుకుంటూ వెడుతుంటే
ఒక గాలి వీచి, చెట్లు ఊగి
నా వొళ్ళంతా వానయ్యింది
ఒక మెత్తటి వణుకయ్యింది
నా చేతులు యిక
నన్ను మాత్రమే
అల్లుకోగలిగే ఒక ఒంటరి సాయంత్రపు కౌగిలి అయ్యింది-
అలా ఎలా వెళ్ళిపోయావు
ఆ వర్షాన్ని వెంటబెట్టుకుని
ఆకుల్లో నీ చూపుల చినుకులని మాత్రం మిగిల్చి?
అలా ఎలా వెళ్ళిపోయావు
ReplyDeleteఆ వర్షాన్ని వెంటబెట్టుకుని
ఆకుల్లో నీ చూపుల చినుకులని మాత్రం మిగిల్చి?
naaku nacchaayi
నువ్వు లేని చెట్ల కింద వెచ్చగా
ReplyDeleteనే నడుచుకుంటూ వెడుతుంటే
ఒక గాలి వీచి, చెట్లు ఊగి
నా వొళ్ళంతా వానయ్యింది
ఒక మెత్తటి వణుకయ్యింది
Wow...its like a painting! Amazing...just fantastic
good one
ReplyDelete