26 June 2012

నా శాపశోకం

రెండు చుక్కల అత్తరు
రెండు చుక్కల కన్నీరు
రెండు చేతుల మధువు

నీ ఖాళీ పాత్రల కనుల నిండా తన రెండు తల్లి కౌగిళ్ళ
లాలించే పాలిండ్లు, పురా జోలపాటలు ఒడి ఊయళ్ళు-

తనువు రేగిపోయిన
నగర రహదారులని
రాత్రుళ్ళతో విసిరి వేసే గాలులలో

తన లేత ముఖాన్ని నీ ముఖంపై
నిండుగా కప్పుకుని నును
వెచ్చగా
ముడుచుకుని పడుకోక పడుకునీ
నిదుర రాక, పోతే

ఒరే లిఖితుడా, నా ఆదిమ భిక్షుకుడా
మెరుపులు పగిలే వేళల్లో ఈ కాలాల్లో
యిక ఇంతకు మించిన శాపం - శోకం

యింకా ఏదైనా మిగిలి ఉందా నీకు-?

No comments:

Post a Comment