ఆకుల చెమ్మ రాలే
చీకటి పూలపై మెరుస్తూ వెళ్ళిపోతుంది గాలి
యిక
నుదిటిన తడిని
తుడుచుకుంటూ
లేస్తావు ఒక్కడివే
కనురెప్పల్ని విద్యుత్కాంతి అంటుకున్న గోడలపై తగలబెడుతో-
ఎందుకొచ్చిందీ మెలకువ
నడి రాత్రి రెండింటికి
దిగులు దిగంతాలని
వెంటేసుకుని
నిదురించిన నయనాలని ఊచకోత కోస్తో?
No comments:
Post a Comment