సముద్ర వనంలో పూచిన
కలువ కళ్ళ నల్లని చేప పిల్ల ఆ పిల్ల
గంపనెత్తుకుని
తిరుగుతోంది
ఆకాశం దాచిన భూమి చుట్టూ
ఒక ప్రాచీన ఆకలిని
ఆగీ ఆగీ గుర్తుకు తెస్తో
---సాగిపోతోంది తనని
దాచుకున్న నీ చుట్టూ
------నిండైన ఒళ్ళు గల
ముద్దబంతిలాంటి ఆ పిల్ల-
బొడ్డులో దోచిన
ఎర్రటి పమిటా
కాలికి మెరిసే
ఆ వెండి పట్టా
-సిగలో పూలూ
నడకలో వాలు-
వలేసి నీ
చూపుల్ని
పట్టుకుని
--వడి వడిగా
వెళ్లి పోతుంది
పచ్చిరొయ్యల
ఉప్పు నీటి వాసనతో
కొరమేను తనువుతో
ఆ నీలి సముద్రపు
ఇసుక ఉంగరాల్లో
తటాలున దాక్కునే
చిన్ని పీతల
చిరునవ్వుతో
గంపెడెంత ఆశ
తీసుకు వచ్చిన
గమ్మతైన ఆ పిల్ల
నీలి నీలాల సీతాకోకచిలుకలు వాలిన
..మెత్తని కోరలున్నఆ పిల్ల
వెన్నెల పులిలాంటి ఆ పిల్ల
విధ్యుత్ఘాతం వంటి
తన నల్లని కళ్ళతో
నీ ప్రాణాల్ని గేలం వేసి
తనతో లాక్కు వెళ్ళే
తెల్లని కోరికైన
ఆ నల్లని పిల్ల-
సరే సరే
అది సరే కానీ
ఆకలిగా లేదూ
నీకు ఇంతకూ?
బాగుందండి
ReplyDeletenice naarration andexpresssion
ReplyDeleteAM HUNGRY...:)
ReplyDeletekorika akali
ReplyDelete