నాన్నా, నవ్వుతూ వెళ్ళమని నువ్వూ
నవ్వుతూ రమ్మని టీచరూ అంటుంది
కానీ, నవ్వడం ఎలాగా నాన్నా - అని
నీటి బుడగలు పగిలే
ఈ ఉదయపు వేళల్లో
కళ్ళల్లో తుంపర కురిసే ఆ సమయాల్లో
గుండె ఉగ్గబట్టుకుని, చేతులతో
నన్ను గట్టిగా బిగించి పట్టుకుని
అడిగాడు ఆ ఆరేళ్ళ పిల్లవాడు
జ్ఞానం ఉబ్బిన బాగ్ బరువుతో
వొంగి, వడలి
ఆటలు లేని
విష కాలంగా
రెప్పపాటులో
అయిపోతున్న
దినంగా మారి
ఏడిచే పెదాలపై
పగిలే నవ్వును
బలవంతంగా లాగుతూ
-అడిగాడు ఆ పిల్లవాడు
'ఇలానేనా?' అని
చెట్లు వీచి
ధూళి రేగి
శరీరం నిశ్శబ్ధం నిస్సహాయతా అయ్యే
కాలాలలో-
ఇంతకూ
నవ్వడం
ఇలాగేనా?
anni praasnale samadhanalu kashtamandi.
ReplyDelete