జ్వలించే చీకటి అంటిన
నీడలు ముసిరిన
నీ నల్లని కనులతో
ఈ వేకువలోకి
వచ్చాను నేను
ఇక నీకు తెలిసిన
ఒక రహస్యమేదో
విచ్చుకుంటున్న
మొగ్గ లోంచి
సోకింది నాకు-
--ఇక ఆ తరువాత
ఎండను కప్పుకుని
ఆ పగలంతా
మన తోటల్లో
కురుస్తూనే ఉంది
---లిపి లేని ఒక
రహస్యపు వాన-
No comments:
Post a Comment