02 June 2012

భిక్ష

నీ కళ్ళని
తీసి అరచేతుల్లో ఉంచుకున్నావా

నీ కాళ్ళని
మేలుకొలిపి బయట అడుగుపెట్టావా

నీ హృదయాన్ని
శుభ్రంగా విదిల్చి
మరొక మరణానికై సంసిద్ధం చేసావా

నీ శరీరాన్ని
రాత్రి చద్ది మూట కట్టుకుని
ఈ లోకంలోకి సాగనంపావా

--తాళం వేయకు పెదాలకి
తెగుతాయని తెలిసినా
తెరిచే ఉంచు బాహువులని

చెమర్చిన
కన్నీళ్లను

తాగేందుకు ఉంచుకో
దాచుకుని బొడ్డులో
--ఒక మధుపాత్రని

------ఆ గుప్పిళ్ళలో
రహస్యంగా అట్టేపెట్టు
ఒక జీవన తేనె పిట్టని--

పద పద పద ప
-యిక మనం
ఈ లోకంలోకి
మనుషులని మనుషులకై
----అడుక్కునే వేళయ్యింది--

1 comment: