27 June 2012

యవ్వనం

పూల మీద ఆగి
అగ్ని మీద వాలి
సీతాకోకచిలుకలై నల్లని అశ్వాలై

ఛాతి విరుచుకుని
కళ్ళు తెరుచుకుని

ఒక కొత్త ఆనందంతో
ఒక కొత్త సుఖంలోకి
మెత్తని మత్తైన
ఆ లోకాలలోకి

బిడియంగా గొడవగా
అలా దుముకుతారు

తమ నాభి కింద
వచ్చిన రెక్కలతో
అలజడిగా
అశాంతిగా

కదిలే ఆ నునుపైన
గరకు యవ్వనంతో
ఈ పిల్లలు!

1 comment: