లిఖిత
05 June 2012
ఇలా
తరిమే ధూళికి
వేలాడుతున్నది
రాలబోయే
పూవు
తన తనువునంతా ఉగ్గపట్టుకుని
తనని వొదిలివేయబోయే
కొమ్మకు-
ఆ సాయంత్రమే
ఆఖరు సారిగా
చూసింది
నిన్ను-
యిక ఆ
తరువాత
-మరొక ముఖంతో
నా ముఖం
-కడుక్కుని
నీ లాంటి ఆ
చేతులలో
ముడుచుకుని
నిదురించలేదు
యిక నేను ఎన్నడూ-
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."
శ్రీకాంత్ అంటూ ఎవరూ లేరు
వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)
No comments:
Post a Comment