06 June 2012

నీదేనా?

శరీరం పైనంతా చీకటి

ఆర్పివేసిన దీపంలోంచి
సన్నటి పొగ

నీ చేతులై పెదాలై
నీ మెత్తని నాలికై
-చుట్టుకుంటోంది-

ఇంతకూ
నీ తలుపుకు అవతల
ఆ నునుపైన జూలుతో
ఆవలించుకుంటూ
అసహనంగా కదిలే

ఆ బూడిద రంగు పిల్లీ
దాని లేతెరుపు నాలికా
దాని ఎర్రని కళ్ళ చారాల కోరల కోరికా నీదేనా?

1 comment:

  1. వామ్మ్మో .... య్....
    నిశ్శబ్దంగా వళ్ళు జలదరిందించింది

    ReplyDelete