నెలవంకల వంటి
ఎండ కనురెప్పల
_________ కింద ఆ రోజంతా ఇలాగే గడిపాను
అదే గదిలో , నువ్వు
అలా నిస్త్రాణగా లేచి
వెళ్ళిపోయిన గదిలో
__________ వెళ్ళిన నీ నిట్టూర్పు
__________ వేడిగా వీచే నీ గదిలో
ఆ మంచంపై బోర్లా పడుకుని
గాలి నీళ్ళల్లో చేతులూపుతూ
సాయంత్రం దాకా
పాల నేలపై రాలిన
నా రాతి ముఖాన్ని
---చూసుకుంటూ
మాట్లాడుకుంటూ
మళ్ళా నువ్వొచ్చి విసురుగా
పెరటి తలుపులు తెరచి
రాత్రిని లోపలి పిలిచేదాకా
ఒక్కడినే అనేకమందిని అయ్యి
నా ఒక్కడికే నాలో బందీ అయ్యి
-ఇకా రోజంతా అలాగే
నిమ్మళంగా గడిపాను-
--ఇంతకూ
వస్తూ వస్తూ
--మనకు--
మన చీకటింట వంటింట్లో
పొయ్యి వెలిగించేందుకు
_____________ ఇన్ని బియ్యం
_____________ అన్ని కూరగాయలూ
_____________ తెచ్చావా
నీ దినవారీ నిందలతో పాటూ
నీ తనువంత ప్రేమ శాపలతో
నీ జీవితపు వేదనతో పాటూ?
No comments:
Post a Comment