23 June 2012

ఎవరో

వేకువ గట్టునే లేచి
నిన్నొక రాత్రి నిదురించిన బొంతను చేసి
చక్కా చుట్ట చుట్టకుని వెళ్ళిపోయారెవరో

నీ ముఖాన కనీసం
ఇన్ని చల్లని నీళ్ళైనా
చిలుకరించక
పలుకరించక-

యిక ఆ తరువాత
అద్దంలో చూసుకుంటూ
తనలో తాను
నవ్వుకుంటూ

బొట్టుపెట్టుకున్న
ఆ ప్రతిబింబం
ఆ రూపం

ఎవరిది-?

No comments:

Post a Comment