10 June 2012

ఆగమనం

నిండైన ఒద్దికతో ఓపికగా

ఎక్కడి నుంచో
తన రెక్కల్లో దాచుకుని తెచ్చుకున్న
ఓ నీటి విత్తుని
యిక్కడ ప్రేమగా నాటింది
తనతో తానే విసిగిపోయిన
ఈ వేసవి పిట్ట-

యిక రాత్రి బాటలో
అలసి కూలిపోయిన
నీ దాహపు దేహం

ఈ ఉదయాని కల్లా

చినుకుల పూలు
జల్లై రాలుతున్న
ఆ నీటిచెట్టు కింద

నీ ఆత్మ తడిచిన
మట్టి చల్లదనంతో
హాయిగా నిదుర లేచింది-

No comments:

Post a Comment