నేలపై
పగిలిన తేనె నిండిన గాజుపాత్ర చుట్టూ చక్కగా చీమలు
ఆ పక్కగా మంచంపై విరిగి
మధువు నిండిన శరీరంతో
ఇరువై గంటలకు పైగా స్పృహ తప్పి
తేనె తాగివేయబడి వడలిన
ఆ పూల ముఖంతో అతను-
ఇంతకూ అతని గదిలోకి
నిత్య దినాల శ్రమతో
తేనెను సేకరించి తెచ్చిన
ఆ పగిలిన పాదాలు
అ పగిలిన పెదాలూ
ఆ పగిలిన చేతులూ ఏ శోకపు స్త్రీవి?
No comments:
Post a Comment