30 June 2012

అర్హత

చీకట్లో

ఈ చీకటి గులాబి రేకులను
తెంపుతూ కూర్చున్నాను
నీ ఎదురుగా

విసురుగా వీచే చీకట్లో

గాలికి రాలకుండా గుప్పెడు
వెలుతురు ప్రాణం పోకుండా
ఆ కొవ్వొత్తి చుట్టూ
అర చేతులు కప్పి

కూర్చున్నావు
నువ్వేమో నా
ధూళి నిండిన కళ్ళల్లో-

ఇంతకూ
రెమ్మలు
పెరికే విషాద హ్రుదయుడైన మనిషికి
నిశి గంధంలో నిప్పుల వాన వలె రాలి
వికసించిన

పసిడి జ్వాలైన నీ ముఖంతో
తన చేతులు కడుక్కునే
అంతిమ అర్హతా ఒక
ప్రాయశ్చిత్తం ఉందా?

3 comments:

  1. చాలా లోతైన భావం...రెండు మూడు సార్లు చదివితే కానీ భావం పూర్తిగా గొచరించలేదు.
    బాగా రాశారు.
    Congrats!

    ReplyDelete
  2. వుంది...మధుశాల ల ...నిశబ్ద...రాత్రులలో...

    ReplyDelete