ఒక తిరుగుబోతు పదం
నీ దగ్గర ఉంటే చెప్పు
వింటానొరే, తల ఒగ్గి
నువ్వు ఉన్నన్నాళ్ళూ
బాంచెన్ అంటూ ఎందుకు
భాష ముందు
ఎంగిలిపడటం?
--తిరిగి తిరిగి వలయమైన
తోక చుట్టూ తిరుగుతుంది
మనసొకటి ఏమీ చేయలేక
చూపులపై పొట్టు పోలేకా
ఎక్కడా మొలకెత్త లేకా
అరుస్తుంది నీ హృదయం
ఒక పిల్ల కాకై నీ
శభ్దాల ముందు-
కంగారు పడకు - పడకు
నీ భాష నీకున్నూ
ఎప్పుడూ ఆ అతిధే
వస్తుందో రాదో మరి
తన భాష నీకు
నీ భాష తనకు
విను వినా విను
కను కను తనను
నీ ఇంటిలోకి నిను
మరి తను ప్రేమగా
ఆహ్వానిస్తుందో
లేదో మరా చింకి గీతల
పాల కంకుల పలకల
చిన్ని పాపకీ తెలియదు-
ఒరే నాయనా
సంపర్క జ్ఞానీ
నిన్న నీ చీకట్లో ఒక కోడి కూచింది
ఇక వెళ్దామా అలా
లేచిపోయి మనం
మనం దోచుకున్న
మనం లేని మన
పూర్వీకుల
పూరిళ్ళకి-?
No comments:
Post a Comment