30 June 2012

ఇలా కూడా

నీరెండ పడి
నీడలతో ఊగుతోంది నగర ఉద్యానవనంలోని
ఈ గాలి పూవు

దానిని పట్టుకుని
నీకు ఇద్దామనే ఆ పిల్లవాడి తపన అంతా

యిక చూడు
సీతాకోచిలుక వంటి గాలి వెనుక
రివ్వు రివ్వున పరిగెత్తుతాం
నేనూ ఒక చిన్న పిల్లవాడు
పోటీ పడి, రెక్కల్లేకుండా ఎగిరే కుక్కపిల్లలమై ఆ గాలి బంతి చుట్టూ-

యిక చూస్తావు నువ్వు
చిరునవ్వుతో కూర్చుని
క్షణికాలపు ఆ అనంతమైన దృశ్యాన్నీఆనందాన్నీ
అరచేతిలో ముఖాన్ని వాల్చుకున్న
ఈ సాయంత్రపు కనకాంబరపు పూల కాంతిలో-

---యిక ఆ వర్షపు రాత్రిలో
కొవ్వొత్తి కాంతిలో మనం
అన్నం తినే వేళల్లో
అడుగుతాడు కదా
మన పిల్లవాడు- 'అమ్మా

ఇందాక మనం తెచ్చుకున్న
పూవు ఎక్కడ ఉంది?'

3 comments:

  1. Srikanth.
    chaala saarlu anipinchindi,
    nee poems commom people ki cheravu ani,
    kontha mandi ke artham avutundi,

    koddigaa saralangaa raasthe baavuntundi,
    asalu modalu,subject,muginpu koddigaa kashtamgaa vundi,

    +point emitante, nee aksharaalu entho baavuntai,
    inta shabda soundaryam chusi chaala rojulayindi,
    nenu nee akshaaralani entho isthapadatanu,

    1. Your poems seem much like into MYSTIC,
    2. More over inspired by 'Mo' (Vegunta Mohana Prasad)

    Can mail to me
    May I can talk to you!
    dearsridhar@gmail.com

    ReplyDelete
  2. Dear " ," !
    Srikanth poems are not inspired by "MO".
    His poems are unique..and have their own signature..

    ReplyDelete