03 August 2012

ధూళి దీపం వెలిగి

ధూళి దీపం వెలిగి________యట
వాన పూలు రాలి
నీ
ఇంట్లో గాలికి పరదాలు రెపరెపలాడి


పరిగెత్తుకుని వస్తారు
ఆకుపచ్చని మట్టితో
శిరస్సున చినుకుల దీవెనలతో ముఖాలలో లేత కాంతి నవ్వులతో

పిల్లలూ, ఆ కుక్క

పిల్లలూ పిల్లులూ
బురద బుగ్గలతో ఏరుకుని తెచ్చుకున్న మెత్తని గులక రాళ్ళతో!

తెరిచే ఉంచు
కాస్త నీ ఇంటి

తలుపులను-

No comments:

Post a Comment