22 August 2012

Epistemology

గురూ
నీ నిక్కరు విప్పకుండా
మూత్రమెలా పోస్తావు

నీపై నీ నీరే కన్నీరై
వానై కడలియై నీనీ
నువ్వై నవ్వై నీపై నువ్వే నువ్వై జారి రాలి విరిగి పడకుండా?

(ఇంతకూ

ఒక నీటి అద్దాన్ని తస్కరించి
దానిని అనుసరించి వెక్కిరించి

నా పదాల అపరాధ ముఖంలో

నా అద్దంలో అనవసరంగా
వివస్త్ర అయ్యింది ఎవరు?)

No comments:

Post a Comment