10 August 2012

అవనతం

రాత్రి అలలలోంచి ఒక ముఖం తేలి

నిన్ను మృత్యు పెదాలతో తాకిన వేళ
వెడతావు నువ్వు ఇల్లు కాని ఇంటికి
నెత్తురు పాదాలతో
ఓ పూలగుచ్చంతో

రాత్రిలోని చీకటిగా మారి ఎదురుచూసే
తన నయన సమాదులపై ఉంచేందుకూ
నీకై నువ్వు రెండు నిమిషాలు మౌనం పాటించి నిశ్శబ్ధంగా అవనతమయ్యేందుకూ-

2 comments:

  1. రాత్రిలోని చీకటిగా మారి ఎదురుచూసే
    తన నయన సమాదులపై ఉంచేందుకూ
    నీకై నువ్వు రెండు నిమిషాలు మౌనం పాటించి నిశ్శబ్ధంగా అవనతమయ్యేందుకూ-
    excellent

    ReplyDelete
  2. రాత్రి అలలలోంచి ఒక ముఖం తేలి

    నిన్ను మృత్యు పెదాలతో తాకిన వేళ

    ReplyDelete