07 August 2012

ఆవలివైపు

పావురాలు ఉండే నీ కళ్ళల్లో
రెండు గుడ్లు దాచుకున్నాను
నేను.

(అవి నా రెండు చేతులు అనే
అనుకో ప్రస్థుతానికి. కానీ...)

వెలిసిన నీ శరీరంలో
వాన శ్వాస ఊదిన
ఒక ఇంద్రధనుస్సు.

/నిజం


నువ్వు

పొదిగిన ఇళ్ళల్లో
పిల్లలెవరూ లేరు
దాగి ఇపుడు.

పర, పరా వర్తనం
చెంది, వాళ్ళ

హృదయం కాంతి తీగలై
సమాధి అయ్యింది
యిక్కడే
. నువ్వు
చూసే
ఈ తెరపైనే!

ఎవరు చెప్పగలరు
అసలు నువ్వున్నావో
లేక ఒక ప్రతి/బింబాన్ని

అనేక వలయాలుగా
పూజిస్తున్నామో? సరే

ఉరితాళ్ళు ఉండే నీ కళ్ళల్లో
ఇద్దరిని దాచుకున్నావు
నువ్వు.

యిక కాంతి శాంతి
ఎక్కడా రాగిణీ-?

ఓం తత్సత్!
నిన్ను తాకి
నిన్ను కోరీ
పురుషులు

అనాధలై
దేహార్తులై
శరణార్ధులై

ప్రధమ పాపపు
పవిత్ర శోకితులై

చచ్చిపోయేదీ
ఇకిక్కడే
! తాగిపో
నిండుగా ఈ

దేహపాత్రని.
దేహ పాత్రా
ధారినీ.

No comments:

Post a Comment