13 August 2012

మృతమయం

నా తలను తెంచి నీ అరచేతుల పూలపాత్రలో
ఆలంకరిస్తాను - ఒద్దికగా ఓపికగా ఇష్టంగా -

రాత్రిపూట నీ గదిలో ఒక తెల్లని దీపమై వెలిగేందుకూ
చీకట్లో మంచి నీళ్లకై నువ్వు తడబడితే
ఓ నెత్తురు కూజానై నీకు అందేందుకూ-

అందుకనే వెళ్ళిపోనీ నన్ను తాత్కాలికంగా. ఇపుడు కనుక

నా అరచేతుల్లోకి నా ముఖాన్ని వొంచుకుని
ఆ అద్దపు నీటిలో కొట్టుకులాడే
రెక్కలు రాని పిచ్చుక పిల్లలని
నేను అందుకోకపోతే, రేపటికి

వెన్నెల కపోతాలని కన్నులపై
రాసేన ఒక చీకటి మనిషి ఎలా
చీకటై చిరుగులై తుంపి వేసిన
నవ రేకుల పూవై నీ సన్నిధికి వచ్చి ఎలా ఈ
మృత పదాలని చూసి రాస్తాడో
యిక నువ్వే చూస్తావు- అనునయంగా ప్రేమగా!

No comments:

Post a Comment